తిరుమలలో నమాజ్ కలకలం.. టీటీడీ ఈవో కీలక విషయాలు వెల్లడి

by Jakkula.Mamatha |

ఇటీవల తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేయడం తీవ్ర కలకలం రేపింది.

తిరుమలలో నమాజ్ కలకలం.. టీటీడీ ఈవో కీలక విషయాలు వెల్లడి
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేయడం తీవ్ర కలకలం రేపింది. తిరుమల కళ్యాణ్ వేదిక వద్ద మధ్యాహ్నం ఓ వ్యక్తి నమాజ్ చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో టీటీడీ సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్ చూడటంతో దృశ్యాలు బయటపడ్డాయి. అయితే.. తిరుమల(Tirumala)లో అన్యమత ప్రచారం చేయకూడదనే నిబంధనలు ఉన్న అతిక్రమించడం పై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటన పై తాజాగా టీటీడీ ఈవో స్థానిక అన్నమయ్య భవన్‌లో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలోని కళ్యాణ వేదికలో ఓ ముస్లిం వ్యక్తి నమాజు చేసిన ఘటనకు సంబంధించిన పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడైనట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు(TTD EO Shyamala Rao) తెలిపారు. కొందరి ప్రోద్భలంతోనే సదరు వ్యక్తి కళ్యాణ వేదికలో నమాజు చేసినట్లు తేలిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు నిందితుడిపై దేవాదాయ శాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Next Story