Tirumala:మరోసారి చిరుత కలకలం.. టీటీడీ ఉద్యోగికి తీవ్ర గాయాలు

by Jakkula.Mamatha |

తిరుమల(Tirumala)లో మరోసారి చిరుత పులి(Cheetah) సంచారం కలకలం సృష్టించింది.

Tirumala:మరోసారి చిరుత కలకలం.. టీటీడీ ఉద్యోగికి తీవ్ర గాయాలు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో మరోసారి చిరుత పులి(Cheetah) సంచారం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. అలిపిరి సమీపంలో చిరుత సంచారం భక్తులను ఆందోళనకు గురి చేసింది. వేదిక్ యూనివర్సిటీ వద్ద రోడ్డు దాటుతున్న చిరుతను.. ద్విచక్ర వాహనం పై వెళుతున్న టీటీడీ ఉద్యోగి (TTD employee) విజయ్‌కుమార్(Vijay Kumar) చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈక్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో స్థానికులు విజయ్‌కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే ప్రజలు భయపడుతున్నారు. సమాచారం తెలుసుకున్న అటవీ, టీటీడీ(TTD) సిబ్బంది స్థానికులను అప్రమత్తం చేశారు.

Next Story