- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ నిర్మాణం.. టీటీడీ కీలక నిర్ణయం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి 25వ తేదీన రథ సప్తమి వేడుకలను కూడా టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో అంగరంగ వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి 25వ తేదీన రథ సప్తమి వేడుకలను కూడా టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో అంగరంగ వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. రథ సప్తమి వేడుకలు విజయవంతమవ్వడంతో మంగళవారం ఆయన అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తిరుమలకు వస్తున్నారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వాహనాల రద్దీ నేపథ్యంలో తిరుమలలో త్వరలోనే మల్టీలెవల్ కార్ పార్కింగ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని, రాంభగీచా వద్ద భక్తుల తోపులాటలు నివారించేందుకు భవిష్యత్తులో పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రథ సప్తమి రోజున నిర్విరామంగా కష్టపడిన అర్చక స్వాములు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా..
అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా భక్తుల నుంచి వాట్సాప్, ఐవీఆర్ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయాలు సేకరించడం జరిగిందని, భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఉత్తరమాడ వీధిలో ఒక భక్తుడు కూడా సదుపాయాలు బాగాలేవని చెప్పకపోవడం టీటీడీ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. పలువురు భక్తులు గ్యాలరీల్లో అదనపు మరుగుదొడ్లు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారని అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు. అధికారుల వివరాల ప్రకారం.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలు వీక్షించారు. 9.42 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు, 2.15 లక్షల మందికి వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 220 మంది శ్రీవారి సేవకుల సేవలు వినియోగం.
విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా, పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని 1800 మంది పోలీసులు, 1414 మంది విజిలెన్స్ సిబ్బంది, 150 మంది ట్రాఫిక్ సిబ్బంది సేవలు అధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా 3.56 లక్షల గ్యాడ్జెట్స్, బ్యాగులు లగేజీ కేంద్రాల్లో డిపాజిట్ అయింది.ఇది గత ఏడాది కంటే 73 శాతం అధికం అని తెలిపారు తిరుపతి నుంచి తిరుమలకు 1932 ట్రిప్పుల ద్వారా 60425 మంది భక్తులు ప్రయాణించగా, తిరుమల నుంచి తిరుపతికి 1942 ట్రిప్పుల ద్వారా 82,241 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుపతికి చేరవేశారు. రథ సప్తమి సందర్భంగా తిరుమలలో చేసిన విద్యుత్, పుష్పాలంకరణలు అద్భుతంగా ఉన్నాయని భక్తుల నుంచి విశేష స్థాయిలో ప్రశంసలు తెలిపారు. శ్రీవారి వాహనసేవల ఎదుట భక్తులను ఆకట్టుకునేలా 1000 కళాకారులు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లో మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించారు. ఇందుకుగాను అదనంగా 590 పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.






