- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీ.. సిబ్బందికి కీలక ఆదేశాలు
తిరుమలలో టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Thirumala)లో టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు (TD Chairman BR Naidu) ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ఆలయ ప్రాంగణంలో శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులను (Devotees) ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అలాగే సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ (Feed Back) తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ భక్తుడు టీటీడీ సాంకేతిక సేవల్లో కొన్ని లోపాలను గుర్తించి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లాడు.
ఇక తిరుమలలో భక్తులకు పంపిణీ చేస్తున్న లడ్డూ, అన్నప్రసాదాలు చాలా రుచికంగా ఉన్నాయని కొందరు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్ లైన్ ద్వార దర్శనానికి (Off Line Darshan) అనుమతించాలని నిర్ణయం తీసుకున్నందుకు చైర్మన్ కు వృద్ధులు (Senior Citizens) కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయంలో దర్శన క్యూలైన్లు పరిశీలించి, భక్తుల సౌకర్యాలపై బీఆర్ నాయుడు ఆరా తీశారు. అంతేగాక భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు. ఇక రానున్న వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ చైర్మన్ అధికారులకు సూచించారు.






