ఆ ఆలోచనే లేదు.. అసత్య ప్రచారాలపై టీటీడీ ఆగ్రహం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-17 08:42:01  IST  )

తిరుమల లడ్డూ ధరలు పెంచుతున్నట్లు జరుగుతున్న ప్రచారాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు.

ఆ ఆలోచనే లేదు.. అసత్య ప్రచారాలపై టీటీడీ ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ ప్రసాదం(Tirumala Laddu Prasadam) ధరలు పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రచారాలపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు(TTd Chaimen Br Naidu) స్పందించారు. తిరుమల లడ్డూ ప్రసాదం ధరలు పెంచే ఆలోచనే లేదని చెప్పారు. కొందరు కావాలనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఆలోచనలతో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, భక్తులు నమ్మొద్దని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లడ్డూ ప్రసాదంపై ధరలు పెంచమని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేయొద్దని, కఠిన చర్యలు తప్పవని మరోసారి సైతం బీఆర్ నాయుడు హెచ్చరించారు.

Next Story