- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు.. భక్తుల ప్రాణాలతో ఆటలు : టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో తిరుమలలో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యితో తిరుమలలో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై నేడు మీడియాతో మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం భక్తుల ప్రాణాలతో ఆటలాడిందని విమర్శించారు. లడ్డూల తయారీలో ప్రాణాంతకమైన రసాయనాలు వాడారని, అది బయటకు రాకుండా తమకు అనుగుణంగా ఉండే నివేదికలు తయారు చేయించుకున్నారని ఆరోపించారు. నాటి టీటీడీ ఛైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి మెయిల్స్ కూడా వెళ్లాయన్నారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడే భోలే బాబా డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారన్నారు. ఇక్కడున్న వారి సహకారం లేకుండా ప్రైవేటు వ్యక్తి రూ.కోట్ల లావాదేవీలు జరపడం సాధ్యమా? అని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి పీఏ చిన్నప్ప ఖాతాలోకి కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందో సీబీఐ విచారణలో తేల్చాలని, అక్రమాల వెనుక ఉన్నవారి పేర్లు బయటపెట్టాలని సీబీఐని కోరుతున్నామన్నారు. దుర్మార్గుల నుంచి మనమంతా టీటీడీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.






