- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడేపల్లి ప్యాలెస్ వరకూ పరకామణి వాటాలు.. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు?: భానుప్రకాష్
పరకామణి వ్యవహారం.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు బయటకు రావాలని టీటీడీ

దిశ, వెబ్‌డెస్క్: పరకామణి వ్యవహారం.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు బయటకు రావాలని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రవికుమార్ అనే వ్యక్తి రోజుకు రూ.10 లక్షలు దోచుకెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని, అందరూ కలిసి రూ.100 కోట్లను పంచుకున్నారని తెలిపారు. ఆపదమొక్కుల వాడి ఖజానాకే భద్రత లేకుండా పోయిందని వాపోయారు. సీసీ ఫుటేజీలో 100 డాలర్ల నోట్ల కట్ట తీస్తున్నట్లు క్లారిటీగా కనిపించిందని, అందులో 112 నోట్లు ఉంటాయన్నారు. కానీ విజిలెన్స్ రిపోర్టులో మాత్రం 9 నోట్లే దొరికినట్లు చెప్పారన్నారు. ఈ విజిలెన్స్ రిపోర్టులో పోలీస్ అధికారి ఒత్తిడితో లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్నామని పేర్కొన్నామని, ఆ పోలీస్ అధికారి ఎవరో తేలాలన్నారు.
రూ.100 కోట్లలో వాటాలు తాడేపల్లి ప్యాలెస్ వరకూ వెళ్లాయని మంత్రి నారా లోకేష్ కూడా అన్నారని, ఇక్కడి నుంచి అక్కడికి వాటాలు ఎలా వెళ్లాయి? దీనిలో ఎవరెవరి హస్తం ఉంది? ఎవరెవరికి ఎంతెంత వాటా అందింది? ఈ విషయాలన్నీ విచారణలో తేల్చాలని అన్నారు. ఇది లోక్ అదాలత్ లో ఉండాల్సిన కేసు అని, క్రిమినల్ కేసు అని అన్నారు. ఒక్కసారి స్వామివారి హుండీలోకి వెళ్లిన సొమ్ము ఏదైనా స్వామివారి ఆస్తేనని, ఆ ఆస్తిని వీరంతా ఎలా పంచుకుంటారని ప్రశ్నించారు.






