- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీ: పురంధేశ్వరి
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ పదవి రాజకీయ పునరావాస పదవి కాకూడదని అన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే ఆ పదవికి న్యాయం చేయగరని అన్నారు. ఈ మేరకు మంగళవారం పురంధేశ్వరి ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేపట్టిందని.. ఆ నియామకాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తే చివరకు 52 మంది నియామకం నిలిపివేశారు అని దగ్గుబాటి పురంధేశ్వరి ట్విటర్ వేదికగా గుర్తు చేశారు. ఈ నియామకాలను పరిశీలిస్తే వైసీపీ రాజకీయ పునరావాసంగా టీటీడీని వాడుకుంటుందని అర్థమవుతుందన్నారు. ఇకపోతే ఇటీవలే టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. త్వరలోనే భూమన టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇలాంటి తరుణంలో పురంధేశ్వరి ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.






