- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మన్యం బంద్ కంటిన్యూ.. మంత్రి సంధ్యారాణి రియాక్షన్ ఇదే..!
ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలని నిరుద్యోగ గిరిజన యువత చేపట్టిన మన్యం బంద్ రెండో రోజూ కూడా కొనసాగుతోంది..

దిశ, వెబ్ డెస్క్: ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ (Agency Special DSC)ప్రకటించాలని నిరుద్యోగ గిరిజన యువత(Unemployed tribal youth) చేపట్టిన మన్యం బంద్ రెండో రోజూ కూడా కొనసాగుతోంది. మన్యంబంద్‌లో భాగంగా కలెక్టరేట్ వద్ద గిరిజన, ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గుమ్మడిలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, సాలూరు, పార్వతీపురం తదితర ప్రాంతాల్లో బంద్ నిర్వహించారు. ఈ బంద్‌లో వాణిజ్య సముదాయాలు, హోటళ్లు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఆటోలు, బస్సుల రాకపోకలు సైతం నిలిచిపోయాయి.
అయితే ఈ బంద్‌పై శనివారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి(Minister Gummadi Sandyarani) స్పందించారు. ఆదీవాసి గిరిజన యువత ఆధైర్యపడవద్దన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు(YSR Congress Party leaders) ఆడుతున్న రాజకీయ ఆటలో నిరుద్యోగులు పావులు కావొద్దని చెప్పారు. కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందన్నారు. 16,437 డీఎస్సీ పోస్టుల్లో 2,024 పోస్టులు గిరిజనులకేనని చెప్పారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు డిమాండ్ భావ్యమా అని ప్రశ్నించారు. గిరిజన నిరుద్యోగులకు అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలోనే జీవో నెం.3 నిర్వీర్యం అయిందన్నారు. జీవో నెం.3కి ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామనే మాటకు కట్టుబడి ఉన్నామని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు.






