చింతూరులో ఎక్సైజ్ అధికారుల అత్యుత్సాహం.. అర్థరాత్రి స్టేషన్లో గిరిజన మహిళ

by Naga Rani Yarlagadda |

అల్లూరి జిల్లా చింతూరులో ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

చింతూరులో ఎక్సైజ్ అధికారుల అత్యుత్సాహం.. అర్థరాత్రి స్టేషన్లో గిరిజన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లూరి జిల్లా చింతూరులో ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ మహిళ సారా అమ్ముతుందన్న నెపంతో ఆమెను గత అర్థరాత్రి వరకూ స్టేషన్లోనే ఉంచారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. మహిళను విడిచిపెట్టాలని డిమాండ్ చేయడంతో..చేసేది లేక అధికారులు ఆమెను విడిచిపెట్టారు. గిరిజనుల పట్ల ఎక్సైజ్ అధికారులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని, కావాలనే సారా కేసులు పెట్టి స్టేషన్ కు తీసుకెళ్తున్నారని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story