Trending: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సంచలన సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లో చెప్పేసిన స్టార్ డైరెక్టర్

by Kema Shiva Kumar |   (  Updated:2024-06-02 11:12:21  IST  )

‘ఆర్జీవీ’ వివాదాలకు కేంద్ర బిందువు. టాపిక్ ఏదైనా తనకు ఏది అనిపిస్తే అది పబ్లిక్‌గా తన ఒపీనియన్ చెప్పేస్తూ విమర్శలపాలు అవుతుంటాడు.

Trending: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సంచలన సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లో చెప్పేసిన స్టార్ డైరెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్జీవీ’ వివాదాలకు కేంద్ర బిందువు. టాపిక్ ఏదైనా తనకు ఏది అనిపిస్తే అది పబ్లిక్‌గా తన ఒపీనియన్ చెప్పేస్తూ విమర్శలపాలు అవుతుంటాడు. ఈ క్రమంలోనే ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ చేసిన ఓ ఎగ్జిట్ పోల్ ట్విట్టర్‌లో షేర్ చేయగా అది కాస్తా.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎవరూ ఊహించని విధంగా రాము ఫలితాలు ఉన్నాయి. ఆయన షేర్ చేసిన వాటిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, అదేవిధంగా టీడీపీ కూటమికి కూడా 0-175 అసెంబ్లీ స్థానాలు వస్తాయని తెలిపారు. ఎంపీ స్థానాల్లో వైసీపీ, కూటమికి 0-25 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసిన ఓ ఎగ్జిట్ పోల్ రాము షేర్ చేశారు. అయితే ఆ ట్వీ్ట్ చూసిన నెటిజన్లు.. ‘వీడినీ ఎవరికైనా చూపించండ్రా అలా వదిలేయకండ్రా’ అంటూ కామెంట్ చేశారు, మరికొందరేమో.. ‘ఇది జోక్.. దానికి మేము ఇప్పుడు నవ్వాలా’ అంటూ రిప్లై ఇచ్చారు.

Next Story