- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రావెల్స్ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్రగాయాలు
by Naga Rani Yarlagadda |
తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ప్రైవేట్, ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా శ్రీకాళహస్తి సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. పెద్దకన్నలి ఎస్టీ కాలనీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యక్ష సాక్షులను విచారించారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వాపోయారు. బస్సు డ్రైవర్ పై దాడికి దిగగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రైవేటు బస్సుల్లో ప్రయాణం అంటే.. ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు, డ్రైవర్ల తీరు మారడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
Next Story






