- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం’.. రవాణాశాఖ మంత్రి వెల్లడి
ఏపీ రాజధాని అమరావతికి మంచి రోజులు రాబోతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని అమరావతికి మంచి రోజులు రాబోతున్నాయి. గత ఐదేళ్లుగా నిలిచిన రాజధాని నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) అమరావతి పున:శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. ఈ తరుణంలో అమరావతి పునః నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) పర్యటన నేపథ్యంలో తెనాలిలో ఆర్టీసీ, రవాణా ఏర్పాట్లపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్(Minister Ramprasad Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనకు సంబంధించిన అన్ని రవాణా సౌకర్యాలు సమర్ధవంతంగా అందించేందుకు ఆర్టీసీ(RTC) అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ క్రమంలో 400 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. సుమారు 20 వేల మందిని సభకు తరలించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. ప్రధాని పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుంది.
ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులు, అదనపు సర్వీసులు అమల్లోకి తేవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ లు ఆలపాటి రాజేంద్రప్రసాద్, బీటీ నాయుడు, పాల్గొన్న గుంటూరు ప్రాంతీయ మేనేజర్, డిపో మేనేజర్లు, రవాణా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి అధికారి చిత్తశుద్దితో పనిచేయాలని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులకు సూచనలు జారీ చేశారు.






