- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrasekhar Reddy : రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు
కడప రవాణాశాఖ(Transport Department) డిప్యూటీ కమిషనర్(Deputy Commissioner)చంద్రశేఖర్ రెడ్డి(Chandrasekhar Reddy)పై బదిలీ వేటు పడింది.

దిశ, వెబ్ డెస్క్ : కడప రవాణాశాఖ(Transport Department) డిప్యూటీ కమిషనర్(Deputy Commissioner)చంద్రశేఖర్ రెడ్డి(Chandrasekhar Reddy)పై బదిలీ వేటు పడింది. మహిళా బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఇంటికి వెళ్లి డీటీసీ వేధించిన ఘటనలో నిన్న డీటీసీపై మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీంతో డీటీసీపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బదిలీ ఉత్వర్వులు జారీ చేశారు.
రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చంద్రశేఖర్‌కు ఆదేశాలిచ్చారు. డీటీసీపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల అనుచిత ప్రవర్తన, క్రమశిక్షణా రాహిత్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, అటువంటి అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని రవాణ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కాగా చంద్రశేఖర్ రెడ్డిపై బాపట్ల, శ్రీకాకుళంలో పనిచేసిన సమయంలోనూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. కడప డీటీసీపై ఇప్పటికే 4 కేసులు నమోదైనట్లు సమాచారం.






