- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ(Acb) వలకు ట్రాన్స్ కో ఏఈ(Trans Co Ae) చిక్కారు. పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District) మక్కువ(Makkuva)కు చెందిన రైతు(Former) కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం ట్రాన్స్ కో ఏఈ జోగినాయుడును కలిశారు. అయితే రూ. 17 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు పక్కా స్కెచ్ వేసి జోగినాయుడు వద్దకు రైతును పంపారు. లంచం తీసుకుంటుండగా జోగినాయుడును రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శాఖా పరమైన చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉచితంగా ప్రజలకు సేవలు అందించాలని, ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు లంచం అడిగితే బాధితులు ధైర్యంగా తమను సంప్రదించాలని సూచించారు. జోగినాయుడు లంచావతారంపై తమకు సమాచారం అందించిన రైతును అభినందించారు.
Next Story






