- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ వర్షాలు.. పలు రైళ్లు దారి మళ్లింపు, కొన్నిట్రైన్స్ క్యాన్సిల్
బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా కనిపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో కొనసాగుతోన్న అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా కనిపిస్తోంది. ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు కాలనీలు నీట మునిగాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఎల్ఎన్ పేట, జలుమూరు, వజ్రపుకొత్తూరు, ఆముదాలవలస, సరుబుజ్జిలి, కొత్తూరు, లావేరు, కవిటి, కంచిలి మండలాల్లో భారీగా వర్షం కురుస్తుండగా.. నాగావళి, వంశధార నదుల ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. జిల్లా కలెక్టరేట్ లో 08942240557 నంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. సహాయం కోసం సంప్రదించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో విజయనగరం మండలం చెల్లూరు వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడి 11 మందికి గాయాలయ్యాయి. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా కిరండోల్ మార్గంలో పలురైళ్లను దారి మళ్లించి, కొన్నింటిని రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 18515, 18516 విశాఖ టు కిరండోల్ విశాఖ ఎక్స్ ప్రెస్ ను సోమ, మంగళ (ఆగస్టు 18,19)వారాల్లో రాయగడ మీదుగా దారి మళ్లించారు. అలాగే 58501 విశాఖ - కిరండోల్ ప్యాసింజర్ ను అరకు వరకు, 58502 కిరండోల్ ప్యాసింజర్ ను కోరాపుట్ వరకు పరిమితం చేశారు. ఇక విశాఖ టు కిరండోల్, కిరండోల్ టు విశాఖ ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు.






