టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన శిక్షణ తరగతులు

by Thanuru Gopichand |

నాయకత్వ నైపుణ్యాలను పెంచడంపై టీడీపీ స్పెషల్ ఫోకస్.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన శిక్షణ తరగతులు
X

దిశ, వెబ్ డెస్క్ : మంగళగిరిలోని టీడీపీ (TDP) కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీలకు శిక్షణ తరగతులు (Training Classes) ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రతిమకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావుతో (Palla Srinivasa Rao) కలిసి నివాళులు అర్పించారు. శిక్షణ తరగతులకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్ కు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.

శిక్షణ తరగతుల్లో భాగంగా పార్టీ లక్ష్యాలు ఏమిటి.. వాటిని సాధించడం ఎలా? అనే అంశాలపై పార్టీ సీనియర్లు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం, ప్రజలతో మమేకం అవ్వడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం గురించి తెలియజేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, అందులో టీడీపీ వైఖరి, కూటమి ప్రభుత్వ పాత్ర గురించి అవగాహన కల్పించనున్నారు. సీనియర్ నేతల ఆధ్వర్యంలో సాయంత్రం వరకూ పార్లమెంట్ కమిటీలకు శిక్షణ తరగతులు జరుగుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం ముగింపు సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరై కమిటీలకు మార్గదర్శనం చేస్తారు.

Next Story