విషాద ఘటన.. పిల్లలతో సహా కాల్వలో దూకి తల్లి ఆత్మహత్య

by Muthe.Rajitha |

ఏపీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

విషాద ఘటన.. పిల్లలతో సహా కాల్వలో దూకి తల్లి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టం వచ్చిందో తెలియదు కాని ఓ తల్లి తన ఇద్దరు ఆడపిల్లలతో సహా కాలువలో దూకి ప్రాణాలు తీసుకుంది. నంద్యాల పోలీసుల వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలో ఒండుట్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, ఆమె కూతుళ్లు వైష్ణవి (4 ఏళ్లు), సంగీత (5 నెలలు)ను శ్రీశైలం కుడి కాల్వలో తోసేసి అనంతరం తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో వారు ముగ్గురూ మృతి చెందారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story