విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

తిరుపతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది..

విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati District)లో విషాదం చోటు చేసుకుంది. తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. సూళ్లూరుపేట మండలం ఉగ్గుమూడికి చెందిన వివాహిత వరలక్ష్మికి ఇద్దరు పిల్లలు వర్షిత్, ప్రశాంత్ ఉన్నారు. కొన్ని రోజులుగా కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో కలహాలు మరింత ఎక్కువ కావడంతో వరలక్ష్మి మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బావిలో నుంచి వరలక్ష్మితో పాటు ఇద్దరు పిల్లల మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story