- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉపాధి కూలీలపై విరుచుకుపడ్డ తేనెటీగలు.. ఐదుగురి పరిస్థితి విషమం
కాకినాడ జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేసుకుంటున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు విరుచుకుపడ్డాయి..

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) పెదపూడి మండలం కరకుదురు(Karakuduru) గ్రామంలో గురువారం విషాదం(Tragedy) చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేసుకుంటున్న కూలీలపై ఒక్కసారిగా తేనెటీగలు(Bees) విరుచుకుపడ్డాయి. ఈ పరిణామంతో భయాందోళనకు గురైన కూలీలు ప్రాణ రక్షణ కోసం పరుగులు తీశారు. అయినప్పటికీ తేనెటీగల దాడిలో మొత్తం 24 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి కూడా ప్రాథమిక చికిత్స అందించి పర్యవేక్షిస్తున్నారు. ఉపాధి పనుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు అధికారులకు ముందే సమాచారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.






