Breaking: సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో విషాదం.. టీడీపీ నేత హఠాన్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-20 13:11:42  IST  )

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది..

Breaking: సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల్లో విషాదం.. టీడీపీ నేత హఠాన్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) పుట్టిన రోజు వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు(Telugu Desam Party official spokesperson Surendra Naidu) హఠాన్మరణం చెందారు. ఈ రోజు చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా కర్నూలులో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సురేంద్రనాయుడు.. స్థానిక వాల్మీకి(Valmiki) విగ్రహానికి పూలమాటలు వేసి నివాళుల్పించారు.


అనంతరం కేక్ కటింగ్ కోసం వెళ్తూ సురేంద్ర నాయుడు కుప్పకూలిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితంలేకుండా పోయింది. చికిత్స పొందుతూ సురేంద్రనాయుడు మృతి చెందారు. దీంతో కర్నూలు జిల్లా టీడీపీ నేతల్లో విషాదం చోటు చేసుకుంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే సురేంద్రనాయుడు ఇక లేరని కంటతడి పెట్టుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. సురేంద్ర నాయుడు కుటుంబానికి అన్ని విధాలుగా ఉండగా ఉంటామని హామీ ఇచ్చారు. సోమవారం సురేంద్రనాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Next Story