దేవుడి ఆలయానికి వెళ్తే.. తీవ్ర విషాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-21 13:30:29  IST  )

దేవుడి ఆలయానికి వెళ్లిన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది...

దేవుడి ఆలయానికి వెళ్తే.. తీవ్ర విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: దేవుడి ఆలయానికి వెళ్లిన కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా(Srikakulam) ఆముదాలవలస(Amudalavalasa)లో జరిగింది. బాలురులు ధనుష్, పవన్ సాయితో కలిసి తల్లిదండ్రులు ఆముదాలవలస ఉమారామలింగేశ్వర ఆలయం వద్దకు వెళ్లారు. స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నారు. అయితే పుష్కరిణిలో స్నానం చేస్తున్న సమయంలో ప్రమాదవ శాత్తు ధనుష్, పవన్ సాయి నీటిలో గల్లంతయ్యారు. కొద్దిసేపటికే నీటిలో మునిగిపోయారు. పిల్లలను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరూ మృతి చెందారు. దీంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

Next Story