- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండగపూట విషాదం.. కృష్ణా నదిలో ముగ్గురు యువకులు మృతి
కృష్ణా జిల్లాలో పండగపూట విషాదం చోటు చేసుకుంది

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District)లో పండగపూట విషాదం(Tragedy) చోటు చేసుకుంది. కృష్ణా నది(Krishna river)లో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. అవనిగడ్డ మండలం కొత్తపేట(Kothapet)లో ఈ ఘటన జరిగింది. మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. సరదాగా కృష్ణానదిలో స్నానం చేసేందుకు కొత్తపేటకు వెళ్లారు. కొంతసేపు నది ఒడ్డున కూర్చొన్నారు. మాటలు చెప్పుకున్నారు. ఆ తర్వాత నదిలోకి దిగారు. ఈత కొడుతూ స్నానం చేస్తుండగా ఒక్కసారిగా గల్లంతయ్యారు. తొలుత ఒక యువకుడు నీటిలో కొట్టుకుపోయారు. అతన్ని కాపాడే క్రమంలో ఇద్దరు కూడా నీటిలో గల్లంతయ్యారు. దీంతో కొంతసేపటికి ముగ్గురు కూడా మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గజ ఈతగాళ్ల సాయంతో ముగ్గురు యువకులను బయటకు తీశారు. అనంతరం వారి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. యువకుల వివరాలు తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా కనిపించే యువకులు ఇక లేరని అటు గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకున్నారు.






