- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విషాదం.. స్టూడెంట్ సూసైడ్
నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది....

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ(Nellore Government Medical College)లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. హాస్టల్ మూడో అంతస్తు గదిలో ఉరివేసుకుని విద్యార్థిని(Student) బలవన్మరణం చెందారు. నంద్యాల జిల్లా(Nandyala District) జూటూరకు చెందిన గీతాంజలి ఎంబీబీఎస్(Mbbs) ఫస్టియర్ చదువుతున్నారు. దసరా(Dasara) సెలవులకు ఆమె ఇంటికి వెళ్లారు. కాలేజీలో ఈ రోజు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉండటంతో గురువారం సాయంత్రమే హాస్టల్‌కు వచ్చారు. ఈ ఉదయం టిఫెన్‌కు బయటకు వచ్చి హాస్టల్ వెళ్లింది. తోటి విద్యార్థులు ప్రాక్టకల్స్ పరీక్షకు హాజరయ్యారు. అయితే గీతాంజలి రాకపోవడంతో హాస్టల్ కేర్ టేకర్‌కు సమాచారం అందించారు. హాస్టల్ గదిని తెరిచి చూడటంతో ఉరివేసుకుని వేలాడు మృతదేహం కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






