త్వరలో పెళ్లి.. ఇంతలో తీవ్ర విషాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-12 16:53:16  IST  )

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో విషాదం చోటు చేసుకుంది...

త్వరలో పెళ్లి.. ఇంతలో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: ఇద్దరూ బావమరదళ్లు, ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. బంధువులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ విధి వంచింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో జరిగింది. రైల్వేకోడూరుకు చెందిన సాయి కృష్ణ, అనిత బావ మరదలు. త్వరలోనే వీరి పెళ్లి. అయితే వీరిద్దరూ ఈ రోజు దుర్మరణం చెందారు. వీరు వెళ్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సాయికృష్ణ, అనిత స్పాట్‌లోనే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనతో రైల్వే కోడూరులో విషాదం చోటు చేసుకుంది.

Next Story