Tragedy: ఆ ఐదుగురి ప్రాణాలు దక్కలేదు.. అంతా 20 ఏళ్లలోపు వారే..

by Thanuru Gopichand |

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో గోదావరిలో గల్లంతైన ఐదుగురి యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి.

Tragedy: ఆ ఐదుగురి ప్రాణాలు దక్కలేదు.. అంతా 20 ఏళ్లలోపు వారే..
X

దిశ, డైనమిక్​ బ్యూరో: తూర్పుగోదావరి(west godavari) జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో (Tadipudi) గోదావరిలో గల్లంతైన ఐదుగురి యువకుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. శివరాత్రి(Sivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని మొత్తం 11మంది గోదావరి ఇసుక ర్యాంపులో స్నానానికి (Holy bath) దిగారు. లోతు ఎక్కువగా ఉండడంతో వారిలో ఐదుగురు (Five young men) గల్లంతయ్యారు. ఆరుగురు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన వారిలో తిరుమలశెట్టి పవన్​(19), పడాల దుర్గాప్రసాద్​(17), అనిశెట్టి పవన్​(19), గర్రె ఆకాష్​(17), పడాల సాయి(19) ఉన్నారు. వీరిని రక్షించేందుకు ఎన్టీఆర్​ఎఫ్(ndrf) ​సిబ్బంది సహాయక చర్యలు చేపట్టంది. అయితే అవి ఫలించలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 4 గంటల పాటు గాలించిన అనంతరం అందరి మృతదేహాలును నదిలో నుంచి వెలికితీశారు. గల్లంతైన ఐదుగుగురు మృతి చెందారు. పవన్​, దుర్గాప్రసాద్​, పవన్​, ఆకాష్​, సాయిల మృతదేహాలు లభ్యం అయ్యాయి. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం(Tragedy) నెలకొంది. మృతులంతా 2‌‌0 ఏళ్ల లోపు వారే. చేతికి అందివచ్చిన వారు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను(dead bodies) పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతిచెందిన యువకులు కొవ్వూరు, తాళ్లపూడి, రాజమండ్రిలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులే. ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదఛాయలు అలముకున్నాయి. కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్ గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

Next Story