- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srikalahasti: ఇద్దరి ప్రాణాలు తీసిన ఈత సరదా
ఈత సరదా ఓ బాలుడితోపాటు మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఈత సరదా ఇద్దరి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అరవ కొత్తూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి త్రిశూల్ (12) ఈత నేర్చుకునేందుకు తన ఫ్రెండ్స్ తో కలిసి ఊరిలో ఉన్న బావి వద్దరు వెళ్లాడు. తన ఫ్రెండ్స్ కు ఈత రావడంతో వారంతా బావిలోకి దిగారు. వాళ్లను చూసి త్రిశూల్ కూడా బావిలోకి దూకేశాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. తోటి స్నేహితులు త్రిశూల్ ను కాపాడాలని ప్రయత్నించగా.. ఫలితం లేకపోయింది. దాంతో అక్కడే ఉన్న తరుణ్ రెడ్డి (25) త్రిశూల్ మునిగిపోవడాన్ని గమనించి.. కాపాడేందుకు బావిలోకి దూకాడు. బాలుడిని కాపాడే క్రమంలో తరుణ్ కూడా బావిలో మునిగిపోయాడు. ఇద్దరూ మరణించడంతో.. రెండు కుటుంబాలతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా.. ఒంటిపూట బడులు, వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.






