బాలుడి ప్రాణం తీసిన ఫోన్‌ వివాదం.. విషయం బయటపెట్టిన మిస్సింగ్ కేసు

by Naga Rani Yarlagadda |

మొబైల్ ఫోన్ విషయంలో ఇద్దరు బాలురు మధ్య తలెత్తిన చిన్న వివాదం ఒక చిన్నారి ప్రాణం తీసింది.

బాలుడి ప్రాణం తీసిన ఫోన్‌ వివాదం.. విషయం బయటపెట్టిన మిస్సింగ్ కేసు
X

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ ఫోన్ వాడకం విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఒక చిన్నారి ప్రాణం తీసింది. గూడూరు సమీపంలోని ఓ తోటలో ఈ ఘోరం జరిగింది. గూడూరు గ్రామీణ ఎస్సై తిరుపతయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నూరు ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల బాలుడు, సైదాపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడు.. ఇద్దరూ కలిసి ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటున్నారు. వారి తల్లిదండ్రులు అదే తోటలో పనులు చేసుకుంటున్నారు.

ఆడుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో, ఆవేశానికి లోనైన 17 ఏళ్ల బాలుడు చిన్నారి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భయపడిపోయిన నిందితుడు, సాక్ష్యాలను దాచిపెట్టేందుకు మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టాడు. ఈ నెల 17 నుంచి బాబు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు తోటలో మృతదేహం లభ్యమైంది. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు ఆ మైనర్‌ను అరెస్ట్ చేసి సోమవారం నెల్లూరులోని జువనైల్ హోమ్‌కు తరలించారు.

Next Story