కారంపూడి పల్నాటి ఉత్సవాలలో అపశృతి.. కరెంట్ షాక్‌తో ఒకరు మృతి

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-23 17:16:04  IST  )

కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల చివరిరోజు అయిన కల్లిపాడు రోజు అపశృతి చోటు చేసుకుంది.

కారంపూడి పల్నాటి ఉత్సవాలలో అపశృతి.. కరెంట్ షాక్‌తో ఒకరు మృతి
X

దిశ, చిలకలూరిపేట: కారంపూడి పల్నాటి వీరుల ఉత్సవాల చివరిరోజు అయిన కల్లిపాడు రోజు అపశృతి చోటు చేసుకుంది. దైవ విగ్రహాలను కడిగేందుకు ఆచారవంతులు నాగులేరులో దిగారు. అదే సమయంలో విద్యుత్ వైర్ తగిలి ఇద్దరూ నాగులేరులో పడి విద్యుత్ షాక్ కు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు వారిద్దరినీ స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో జ్వాలా నరసింహం (45) అనే వ్యక్తి మరణించగా.. ప్రకాశం జిల్లా పుల్లల చెరువుకు చెందిన అంకారావు చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అధికారులు గుంటూరుకు తరలించారు. పల్నాటి ఉత్సవాల్లో అపశృతి జరగడంతో ఆ ప్రాంతవాసులు దిగ్భ్రాంతి చెందారు.

Next Story