చేనేత కుటుంబంలో విషాదం.. గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతి!

by Ramesh Naini |

జిల్లాలోని వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ అమోదగిరి పట్నానికి చెందిన చేనేత కుటుంబానికి చెందిన భార్యాభర్తలు బుధవారం ఉదయం మరణించారు.

చేనేత కుటుంబంలో విషాదం.. గంటల వ్యవధిలో భార్యాభర్తల మృతి!
X

దిశ, ప్రతినిధి బాపట్ల: జిల్లాలోని వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ అమోదగిరి పట్నానికి చెందిన చేనేత కుటుంబానికి చెందిన భార్యాభర్తలు బుధవారం ఉదయం మరణించారు. గత కొంతకాలంగా పక్షవాతంతో అనారోగ్యంగా ఉన్న ఇనగాల పార్వతి (60) ఇవాళ ఉదయం అనారోగ్యంతో మరణించడంతో ఆందోళనకు గురైన భర్త ఇనగాల మోహన్ రావు (65) బాత్రూంలో కాలు జారి పడి దుర్మరణం చెందినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మోహన్ రావు డయాలసిస్ పేషెంట్ అని తెలుస్తోంది. వారికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు. 20 ఏళ్ల క్రితం ఇంటి నుండి వెళ్ళిపోయిన కుమారుడు ఇప్పటివరకు జాడ తెలియలేదు. కుమార్తెలకు వివాహం జరగడంతో ఆమోదగిరి పట్టణంలో మృతులు మాత్రమే నివాసం ఉంటున్నారు. సమాచారం తెలుసుకున్న వేటపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి దర్యాప్తు చేపట్టారు. కాగా, దంపతుల మృతితో స్థానికంగా తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి.

Next Story