- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లూరి జిల్లాలో విషాదం.. భారీ వర్షంతో మహిళ మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది....

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రంపచోడవరం మండలం మడిచర్లలో రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వర్షం దెబ్బకు గోడలు నాని పోయి ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడ మృతి చెందారు. విషయం తెలుసుకున్న అధికారులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. వర్షం కారణంగా కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలోకి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వెంటనే పునరావాసానికి వెళ్లాలని తెలిపారు.
ఇక జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. కొన్ని చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ఎక్కడ చిన్న డిజాస్టర్ జరిగినా వెంటనే సహాయ చర్యలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నమని తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని, సహాయ చర్యల కోసం సంప్రదించాలని ప్రజలకు అధికారులు సూచించారు.






