గుంటూరులో పండుగ పూట విషాదం: బిర్యానీ తిన్న 50 మందికి ఫుడ్ పాయిజన్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-15 10:38:59  IST  )

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డి పాలెం గ్రామంలో ఫుడ్ పాయిజన్ తీవ్ర కలకలం రేగింది. పండుగ సంబరాల్లో భాగంగా భక్తులకు, స్థానికులకు బిర్యానీ పంపిణీ చేశారు. అయితే బిర్యానీ తిని ఒక్కసారిగా 50 మంది అస్వస్థతకు గురయ్యారు..

గుంటూరులో పండుగ పూట విషాదం: బిర్యానీ తిన్న 50 మందికి ఫుడ్ పాయిజన్
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur) చేబ్రోలు మండలం(Chebrolu) కొత్తరెడ్డి పాలెం(Kothareddy Palem) గ్రామంలో ఫుడ్ పాయిజన్(Food Poision) తీవ్ర కలకలం రేగింది. ‘గుడారాల పండుగ’(Gudarala Fest) వేడుకలు విషాదంగా మారాయి. పండుగ సంబరాల్లో భాగంగా భక్తులకు, స్థానికులకు బిర్యానీ పంపిణీ చేశారు. అయితే బిర్యానీ తిని ఒక్కసారిగా 50 మంది అస్వస్థతకు గురయ్యారు. బిర్యానీ తిన్న కాసేపటికే చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీంతో వారందరికి స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఆరుగురి పరిస్థితి విషమం

అయితే వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల ఆరోగ్యం క్షీణించడంతో వారిని మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బిర్యానీ తయారీకి ఉపయోగించిన పదార్థాల నాణ్యతపై విచారణ చేపట్టారు.

Next Story