- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అరకు ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని (Alluri District) అరకు ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ భారీగా పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని (Alluri District) అరకు ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. బొర్రా గుహల వద్ద వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో అరకు (Araku) ఘాట్ రోడ్డులో వన్ వే ట్రాఫిక్ (Traffic) ఆంక్షలను పోలీసులు విధించారు. విశాఖపట్నం, ఎస్.కోట నుంచి అరకు వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. అరకు నుంచి ఘాట్ రోడ్డుకు వాహనాలను పర్మిషన్ ఇవ్వడం లేదు. మరోవైపు భారీ రద్దీ, ట్రాఫిక్ నేపథ్యంలో వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పర్యాటకులను అధికారులు అనుమతిస్తున్నారు. అయితే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా అనుమతించబోమని తన ప్రకటనలో వెల్లడించారు.
ఇదిలా ఉంటే అల్లూరి జిల్లా ఏజెన్సీలో చల్లటి వాతావరణం పర్యాటకులను గిలిగింతలు పెడుతోంది. దీంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. వీకెండ్ కు తోడు వరుస సెలవులు కావడంతో పర్యాటకుల సందడితో అరకులో పండుగ వాతావరణం నెలకొంది. అరకు లోయలో హోటల్ గదులు నిండిపోయాయి. ముఖ్యంగా మాడగడ, వంజంగి మేఘాల కొండ వ్యూ పాయింట్లకు పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తిరావడంతో ట్రాఫిక్ బాగా పెరిగింది. సుంకరిమెట్ట ఉడెన్ బ్రిడ్జ్ కు కూడా సందర్శకులు అమాంతంగా పెరిగారు. ఈ క్రమంలో నేడు కూడా ట్రాఫిక్ సమస్య కొనసాగుతూనే ఉంది. శనివారం, ఆదివారం రెండు రోజులు సెలువులు రావడంతో అరకు వచ్చే వారి సంఖ్య భారీగా ఉందని అధికార యత్రాంగం చెబుతోంది.






