కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం.. శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు ప్రారంభం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-03 06:42:31  IST  )

సంపూర్ణ చంద్రగ్రహణం వేళ దేశ వ్యాప్తంగా అన్ని ఆలయాలు మూతపడినా.. రాహు-కేతు క్షేత్రమైన శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు, శాంతి అభిషేకాలు ప్రారంభమయ్యాయి.

కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం.. శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు ప్రారంభం
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి (Srikalahasti)లో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా విశేష పూజలు, ప్రత్యేక శాంతి అభిషేకాలు కొనసాగుతున్నాయి. సాధారణంగా గ్రహణ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాలను మూసివేయడం ఆనవాయితీ. అయితే, రాహు-కేతు క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం గ్రహణ కాలంలోనూ తెరిచే ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అయితే, ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 3.20 ప్రారంభం చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.47 గంటలకు ముగియనుంది. కాగా, 3 గంటలకు పైగా సాగే గ్రహణ కాలంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక క్యూలైన్లతో పాటు తాగునీరు, అల్పాహారం వంటి ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు.

ప్రత్యేక శాంతి అభిషేకాలు..

శ్రీకాళహస్తిలో గ్రహణ సమయాన్ని అశుభంగా భావించరు. గ్రహణ కాలంలోనే స్వామి, అమ్మవార్లకు అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రహణకాల శాంతి అభిషేకాలను నిర్వహించడం ఇక్కడి విశిష్టత. గ్రహణ ప్రభావం దోషపూరితం కాకుండా, లోక కల్యాణం కోసం ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ అధికారులువెల్లడించారు.

Next Story