‘ఆ ఫొటోలు’ పంపి.. భార్యకు టార్చర్!

by Thanuru Gopichand |   (  Updated:2025-02-18 11:18:25  IST  )

అతను ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి. వివాహేతర సంబంధాల వ్యవహారంలో రోడ్డున పడ్డాడు.

‘ఆ ఫొటోలు’ పంపి.. భార్యకు టార్చర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో : అతను ఓ ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి. వివాహేతర సంబంధాల వ్యవహారంలో రోడ్డున పడ్డాడు. పేరు కిరణ్ కుమార్. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీగా పని చేస్తూ ప్రస్తుతం సెలవుపై ఉన్నారు. ఉద్యోగం చేసేది నెల్లూరులో కాగా.. నివాసం ఉండేది గుంటూరులో. అయితే కిరణ్ కుమార్ విహేతర సంబంధాలు పెట్టుకుని తనని హింసిస్తున్నాడంటూ భార్య అనసూయ ఆరోపిస్తుంది.ఇతర మహిళలతో ఏకాంతంగా గడిపిన ఫొటోలు తనకు పంపి వేధింపులకు గురి చేస్తున్నాడని వెల్లడించింది. మనస్పర్ధల కారణంగా వారిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. బాబుని తల్లి సంరక్షణలోనే ఉంచేలా.. ఓ ఒప్పందం కూడా చేసుకున్నారు. శనివారం అనసూయ విజవాడలోని ఓ వివాహానికి హాజరైంది. అక్కడ ఆమెను కిరణ్​కలిశాడు. గత ఆదివారం రాత్రి వారిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు ఆమె చెబుతోంది. దాడిలో అనసూయ స్పృహ కోల్పోగా స్థానికులు ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స అందించారు. అనంతరం ఆమె గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అయితే కిరణ్​పలువురు యువతులతో ఉన్న ఫొటోలను కూడా భార్య బయటపెట్టింది. ఇవి ఇప్పుడు వైరల్​గా మారాయి. ఆ యువతులు ఎవరనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కిరణ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

Next Story