- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తూర్పుగోదావరి జిల్లా మొత్తం కుండపోత వర్షాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా(East Godavari District)లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మారేడుమిల్లి(MareduMilli), బొడ్లంక(Bodlanka)లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అల్లూరు సీతారామరాజు జిల్లా(Alluru Sitharamaraju) గుత్తేడ వద్ద 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజమండ్రి పుష్కరఘాట్(Rajahmundry Pushkar Ghat) వద్ద లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. కాకినాడ, రాజమండ్రి, రావులపాలెంలో వర్షపు నీరు చేరింది. రాజమండ్రి రైల్వే బ్రిడ్జి వద్ద డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీరు రోడ్లపై చేరడంతో వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ జిల్లాలోనూ ఉదయం నుంచి వర్షం కురిసింది. మరోవైపు పండగ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలు తడిసిపోతున్నాయి. మున్సిపల్ అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టారు.






