- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tomatos Price : టమాటా రైతులకు కన్నీళ్ళు.. కేజీ రూ.4
రైతు చేతిలో పంట ఉన్నప్పుడు సరైన ధర ఉండదు.

దిశ, వెబ్ డెస్క్ : రైతు చేతిలో పంట ఉన్నప్పుడు సరైన ధర ఉండదు. విచిత్రంగా రైతు చేతిలో పంట లేని కాలంలో మాత్రం ధరలు ఆకాశంలో ఉంటాయి. ఒక్కోసారి పంట చేతిలో ఉన్నా ప్రకృతి పగబట్టి పంటను సర్వ నాశనం చేస్తుంది. ఇలా రైతులకు ఏ విధంగా చూసిన కన్నీళ్ళు కడగండ్లు తప్ప మరేమీ మిగలవు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని టమాటా రైతుల(Tomato Farmers)కు టమాటాల ధరలు(Tomatos Price) కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. టమాటాల ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు షాక్ కు గురయ్యారు. కర్నూల్(Karnool) జిల్లాలోని ఆస్పరి(Aspari), పత్తికొండ(Patthikonda) మార్కెట్లో నేడు టమాటాలు కేజీ రూ.4 కు పడిపోయాయి. పంట పెట్టుబడులు కాదు కదా.. కనీసం రవాణా ఛార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందారు. చేసేదేమి లేక పంటను తీసుకువచ్చిన రైతులు పంటను పారబోసి బాధతో వెనక్కి తిరిగారు. టమాటాల ధరలు భారీగా పడిపోవడంతో అధికారులు మార్కెట్ ను తాత్కాలికంగా మూసి వేశారు. మరోవైపు బహిరంగ మార్కెట్లో మాత్రం కేజీ టమాటారూ.20 పలకడం గమనార్హం.






