నేడు వై.యస్.రాజశేఖరరెడ్డి పుట్టినరోజు

by Disha Web Desk 10 |
నేడు వై.యస్.రాజశేఖరరెడ్డి పుట్టినరోజు
X

దిశ, వెబ్ డెస్క్: యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి1949 జూలై 8 న జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 2004 నుండి 2009 వరకు పనిచేశారు. 2003 లో ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు నెలల పాటు పాదయాత్ర చేశారు. 2 సెప్టెంబర్ 2009 న నల్లమల అటవీ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తప్పిపోయిందని మనకి తెలిసిందే . కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుద్రకొండ కొండపై హెలికాప్టర్ శకలాలు తర్వాతి రోజు కనిపించాయి. నేడు వై. యస్ రాజశేఖరరెడ్డి 74 వ జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు జరుపుతున్నారు.

Also Read: మీ జయంతి మాకు పండుగ రోజు.. సీఎం జగన్ ఎమోషనల్..

Next Story