- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ సీఎం జగన్‌కు పొగాకు రైతుల లేఖ
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పొగాకు రైతులు లేఖ రాశారు. లేఖలో పర్చూరు నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు జగన్ కు తెలుసా అని ప్రశ్నించారు.

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పొగాకు రైతులు లేఖ రాశారు. లేఖలో పర్చూరు నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు జగన్ కు తెలుసా అని ప్రశ్నించారు. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలు తమను మనోవేధనకు గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా కష్టాలను జగన్ క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేశారా అని ప్రశ్నించారు. అంతే కాకుండా నల్లబర్లీ రైతుల కష్టాలు జగన్ కు తెలుసా.. అసత్య ప్రచారాలతో మా మనోభావాలు దెబ్బ తీయవద్దని లేఖలో పేర్కొన్నారు. పొగాకు రైతుల కోసం కూటమి సర్కార్ రూ.273 కోట్లు కేటాయించిందని తెలిపారు. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పర్చూరు, అద్దంకి, చిలకలూరిపేట, ప్రత్తిపాడు రైతులను ఆదుకుందన్నారు. సాక్షి విలేకరులు తప్పుడు రాతలతో తమను అయోమయోనికి గురిచేస్తోందన్నారు. అవాస్తవ కథనాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారని, పొగాకు సాగు చేయనివారిని బాధితులుగా చూపిస్తున్నారని అన్నారు.






