- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల భక్తులకు శుభవార్త..రేపటి నుంచే టికెట్ల రిజిస్ట్రేషన్

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. రేపటి నుంచి డిప్ ప్రక్రియ ద్వారా ఉచిత సర్వ దర్శనం టోకెన్లు కేటాయించబోతున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా టీటీడీ పాలక మండలి చర్యలు తీసుకుంటోంది. దాదాపు పది రోజుల పాటు సామాన్యులకు వైకుంఠ ద్వార దర్శనాల్లో అవకాశం కల్పించనుంది టీటీడీ. ఈ నేపథ్యంలో డిసెంబర్ 30, 31 జనవరి 1 దర్శనాలకు గాను రేపటి నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఆన్లైన్ లో ముందస్తుగా భక్తులు నమోదు చేసుకోవాలని సూచనలు చేసింది టీటీడీ.
అలా ముందస్తుగా ఆన్లైన్ లో నమోదు చేసుకుంటే, డిప్ ద్వారా ఉచిత సర్వదర్శన టోకెన్లు కేటాయించనుంది టీటీడీ పాలకమండలి. అయితే డిప్ నమోదు ప్రక్రియకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలని పేర్కొంది. వన్ ప్లస్ త్రీ కింద ప్రతి వ్యక్తి నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ , తెలుగు భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. డిసెంబర్ 2న డిప్ లో ఎంపికైన వారికి దర్శన సమాచారం పంపిస్తారు. ఇక జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయబోతున్నారు. భక్తులు టోకెన్లు లేకుండానే నేరుగా క్యూ లైన్ లో ప్రవేశించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చు.






