తిరుపతి : భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం.. మాంసం

by Thanuru Gopichand |

తిరుమల (Tirumala) కొండకు దిగువన.. తిరుమలగిరుల పాదాల చెంత ఘోర అపచారం జరిగినట్లు తెలుస్తోంది.

తిరుపతి : భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం.. మాంసం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల (Tirumala) కొండకు దిగువన.. తిరుమలగిరుల పాదాల చెంత ఘోర అపచారం జరిగినట్లు తెలుస్తోంది. భూదేవి కాంప్లెక్స్ (Bhudevi Complex) వద్ద మద్యం, మాంసం కనిపించడం భక్తుల్లో కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తరచూ జరుగుతున్న ఉల్లంఘనల పట్ల భక్తుల్లో అసహనం వ్యక్తమవుతుంది. పవిత్ర భావంతో భక్తులు ఉండాల్సిన చోట.. ఆ పవిత్ర భావనను దెబ్బతీసేలా మద్యం, మాంసం కనపడడం ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాలపై అన్యమత చిహ్నాలతో వాహనాలు తిరుమల కొండకు చేరడం, ఇప్పుడు ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలిపిరి వద్ద సరైన తనిఖీలు లేనందునే ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు దర్శనం టోకెన్లను కేటాయిస్తారు. కాలినడకన వెళ్లే భక్తులు ఇక్కడ టోకెన్లను తీసుకొని తిరుమల కొండపైకి మెట్ల మార్గంలో నడకను ప్రారంభిస్తారు. ఈ క్రమంలో భూదేవీ కాంప్లెక్స్ వద్ద మంగళవారం మద్యం బాటిల్, మాంసాహారం పడి ఉన్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అవి పార్కింగ్ ప్రాంతంలో పడి ఉండటాన్ని పలువురు భక్తులు గమనించారు. ఇదెక్కడి అపచారం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పవిత్ర తిరుమల తిరుపతి క్షేత్రంలో మద్యం, మాంసం కనిపించడం ఏమిటని ప్రశ్నించారు. టీటీడీ పవిత్రను కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు. అయితే భూదేవీ కాంప్లెక్స్ వద్ద ఇటువంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మద్యం, టీటీడీ పరిధిలో మద్యం, మాంసం నిషేధం ఉన్నప్పటికీ తరచూ వాటి వినియోగం వెలికి చూడడంలో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోంది. టీటీడీ యంత్రాంగం కూడా వాటిని నిలువరించడంలో విఫలమవుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశ్యపూర్వకంగానే ఇటువంటివి జరుగుతున్నాయా అనే వాదనలకు బలం చేకూరుస్తోంది. గోవింద నామస్మరణ జరగాల్సిన చోట ఇటువంటి చోటు చేసుకోవడం సరకాదనే అభిప్రాయం భక్త జనుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటకైనా ఇతర మత చిహ్నాలు, మద్యం, మాంసం, ధూమపానం వంటివి టీటీడీ పరిధిలోకి ప్రవేశించకుండా అప్రమత్తంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు.

Next Story