తిరుపతి జనసేన సమావేశం రసాభాస.. తీవ్ర ఉత్కంఠ

by Vemula.Srinu Prasad |

తిరుపతిలో నిర్వహించిన జనసేన పార్టీ ప్రాంతీయ సమీక్షా సమావేశం తీవ్ర ఉత్కంఠకు, రసాభాసకు దారితీసింది. ...

తిరుపతి జనసేన సమావేశం రసాభాస.. తీవ్ర ఉత్కంఠ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో నిర్వహించిన జనసేన(Janasena) పార్టీ ప్రాంతీయ సమీక్షా సమావేశం తీవ్ర ఉత్కంఠకు, రసాభాసకు దారితీసింది. ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచి హాజరైన నేతలు, కార్యకర్తల సమక్షంలో పార్టీ అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Former Minsiter Balineni Srinivasareddy) ముందే కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు.

స్థానిక ఇన్‌ఛార్జ్‌ల తీరుపై కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఇన్‌ఛార్జ్‌లను వెంటనే మార్చాలని, వారు కార్యకర్తలను కనీసం మనుషులుగా కూడా గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న వారిని హీనంగా చూస్తున్నారని, ఏ ఒక్క కార్యకర్త కూడా ప్రస్తుత పరిస్థితుల్లో సంతృప్తిగా లేరని నేరుగా బాలినేనికే ఫిర్యాదు చేశారు.

ఇన్‌ఛార్జ్‌ల వైఖరి వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని, వారిని మార్చకపోతే వచ్చే రోజుల్లో ఇబ్బందులు తప్పవని కార్యకర్తలు హెచ్చరించారు. సమావేశం జరుగుతున్నంత సేపూ ఇన్‌ఛార్జ్‌లకు వ్యతిరేక నినాదాలు మిన్నంటాయి. నాయకత్వం తమ గోడు విని తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడంతో తిరుపతి సమావేశం కాస్తా రసాభాసగా మారింది.

Next Story