తిరుమల భక్తులకు బిగ్ బఅలర్ట్.. వదంతులపై కలెక్టర్ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లపై తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించారు..

తిరుమల భక్తులకు బిగ్ బఅలర్ట్.. వదంతులపై కలెక్టర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: ఈసారి తిరుమలలో శ్రీవారి వైకుంఠ ఏకాదశి(Srivari Vaikuntha Ekadashi) కార్యక్రమం డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్(Tirupati District Collector Venkateswar) తెలిపారు. గత సారిలా కాకుండా ఈసారి భక్తులకు సరికొత్త విధానంలో టోకన్లను టీటీడీ(TTD) జారీ చేసిందన్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఉందని చెప్పారు. రాష్ట్రాల వారీగా టోకెన్లు జారీ చేశారని తెలిపారు. అందరిని దృష్టిని పెట్టుకుని టికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా రోజు, కేటాయించిన సమయంలో స్వామివారి దర్శనానికి అధికారులు అనుమతిస్తారన్నారు. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా స్వామి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు.

మూడు రోజుల పాటు తిరుమలకు భక్తులు రావొద్దని సోషల్ మీడియాలో వదంతలు చెలరేగుతున్నాయని, వాటిని నమ్మొద్దని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. 80 నుంచి 85 వేల మంది సామన్య భక్తులకు దర్శనాలు కల్పించేందుకు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. టికెట్ లేని వారికి వీలైంత మేరకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ తెలిపిందని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. వైకుంఠ ఏకాదశి ముగిసే వరకు తిరుపతి లక్షా 50 వేల మంది వస్తారని అంచనా ఉందని, రోజుకు 80 వేల మందికి టీటీడీ దర్శన ఏర్పాట్లు చేస్తున్నారని వెల్లడించారు.

Next Story