Tirumala News : తిరుమల దర్శనం.. ఇక మరింత సులభం

by Muthe.Rajitha |   (  Updated:2025-02-13 15:51:10  IST  )

తిరుమల(Tirumala) తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అంటే మామూలు విషయం కాదు.

Tirumala News : తిరుమల దర్శనం.. ఇక మరింత సులభం
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల(Tirumala) తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం అంటే మామూలు విషయం కాదు. ముందుగానే దర్శనం టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యూ కాంప్లెక్స్ లలో శ్రీనివాసుని దర్శనానికి వేచి చూడాలి. ఇకపై భక్తులకు అలాంటి ఎదురు చూపులు ఉండవు. తిరుమల శ్రీవారి దర్శనాలపై తాజాగా ఏపీ కూటమి ప్రభుత్వం(AP Govt) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇకపై ఏపీ టూరిజం(AP Tourism) ద్వారా శ్రీనివాసుని దర్శనం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ టూరిజం ఛైర్మన్ నూకసాని బాలాజీ చేసిన ప్రత్యేక వినతిని దృష్టిలో ఉంచుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) స్పందించి.. ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పర్యాటక శాఖ ద్వారా కూడా శ్రీవారి దర్శనం కల్పించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో టూరిజం శాఖ ఆయా ఏర్పాట్లలో దిగింది. కాగా గతంలో టీటీడీ(TTD)తోపాటు, వివిధ రాష్ట్రాల పర్యాటక ప్యాకేజీలు, ఆర్టీసీకి ప్రత్యేక దర్శన టికెట్లను ఆలయ మండలి భారీగా జారీ చేసేది. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం కల్పించడంతోపాటు.. ఆ రాష్ట్రాల టూరిజం అభివృద్దికి ఆదాయం పెంచేలా టీటీడీ ప్రణాళికలు చేసింది. అయితే పర్యాటకశాఖ, ఆర్టీసీ నుంచి ఈ టికెట్లు పొందిన ఏజెంట్లు డిమాండ్ ను బట్టి రూ.300 విలువ గల ఒక్కో టికెట్ ను రూ.2500 వరకు బ్లాక్ లో అమ్ముకునేవారు. టీటీడీ విజిలెన్స్ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో ఏజెంట్ల మోసాలు భారీగా వెలుగులోకి రాగా.. వివిధ రాష్ట్రాల పర్యాటకశాఖలకు, ఆర్టీసీకి జారీ చేసే టికెట్లను రద్దు చేసింది. కాగా తాజాగా ఏపీ టూరిజం ఛైర్మన్ ప్రత్యేక విజ్ఞప్తితో ఏపీ పర్యాటకశాఖకు మాత్రమే దర్శన టికెట్లు జారీ చేసేలా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.


Also Read..

తిరుమల కల్తీ నెయ్యి కేసు.. పోలీస్ కస్టడీకి నలుగురు నిందితులు

Next Story