- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామయ్యకు వెంకన్న లడ్డూలు.. ప్రత్యేక విమానంలో అయోధ్యకు తరలింపు
అయోధ్య రాములవారికి తిరుమల వెంకన్న లడ్డూలు సిద్ధమయ్యాయి. ...

X
దిశ తిరుమల: అయోధ్య రాములవారికి తిరుమల వెంకన్న లడ్డూలు సిద్ధమయ్యాయి. ఈ నెల 22న అయోధ్యలో రామయ్య విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో అయోధ్యకు వచ్చే శ్రీరామ భక్తులకు తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదంగా లడ్డూలను అందించనున్నారు. ప్రతి భక్తుడికి 25 గ్రాముల బరువైన చిన్న లడ్డూను అందించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మొత్తం లక్ష లడ్డూలను రెడీ చేశారు.
గురువారం తిరుమల శ్రీవారి సేవాసదన్-1లో లడ్డూ ప్యాకింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. రెండు చిన్న లడ్డూలతో ప్యాకెట్లు ఏర్పాట్లు చేశారు. ఇలా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. ఈ లడ్డూ ప్యాకింగ్‌లను అయోధ్యకు పంపేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని రేపు కార్గో విమానంలో పంపించనున్నారు.
Next Story






