- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల పరకామణి చోరీ కేసు.. హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు
తిరుమల పరకామణి (Parakamani) చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల పరకామణి (Parakamani) చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేసులో ఎన్వీఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకొనేందుకు సీఐడీ (CID), ఏసీబీ డీజీలకు వెసులుబాటును కల్పించారు. చోరీ కేసు లోక్ అదాలత్ (Lok Adalat) వద్ద రాజీ వ్యవహారంతో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సేకరించిన సమాచారాన్ని ఒకరికొకరు షేర్ చేసుకోవాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు కోర్టు సూచనలు చేసింది. అదేవిధంగా అప్పటి టీటీడీ ఏవీఎన్వో వై.సతీష్ కుమార్ పోస్టుమార్టం రిపోర్టును కూడా సీల్డ్ కవర్‌లో రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు అందజేయాలని సీఐడీ అధికారులను ఆదేశించారు. కేసులో తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం ఈ నెల 16కు వాయిదా వేసింది.-






