TTD:ఎల్లుండి ఆ ఆలయంలో సీతారాముల కళ్యాణం.. భక్తులకు తిరుమల లడ్డూల పంపిణీ

by Jakkula.Mamatha |

వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట (Ontimitta) కోదండ రామాలయం (Kodanda Rama Temple)లో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

TTD:ఎల్లుండి ఆ ఆలయంలో సీతారాముల కళ్యాణం.. భక్తులకు తిరుమల లడ్డూల పంపిణీ
X

దిశ,వెబ్‌డెస్క్: వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట (Ontimitta) కోదండ రామాలయం (Kodanda Rama Temple)లో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల(ఏప్రిల్) 15 వరకు జరగనున్నాయి.

శ్రీరామనవమి(Sri Rama Navami) రోజున(ఏప్రిల్ 6న) అన్ని ఆలయాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. కానీ ఆ రోజు సీతారాముల కళ్యాణం లేని ఏకైక ఆలయం ఒంటిమిట్ట కోదండ రామ స్వామి ఆలయమే. ఈ తరుణంలో ఈ నెల 11వ తేదీన సీతారాముల వారి కల్యాణోత్సవం జరుగుతుంది. శుక్రవారం(ఏప్రిల్ 11) జరగబోయే ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి 70 వేల తిరుమల శ్రీవారి లడ్డూలు(Tirumala laddu) సిద్ధం చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు వెల్లడించారు.

సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తులకు తిరుమల లడ్డూల పంపిణీకి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఎల్లుండి(శుక్రవారం) సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు కళ్యాణ వేదిక పై శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.ఈ బ్రహ్మోత్సవాలకు ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు (CM Chandrababu) హాజరై.. పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Next Story