- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ రోజు నుండి అందుబాటులో జూలై నెల టికెట్లు
తిరుమల స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల విడుదలకు సంబంధించి జూలై నెలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తిరుమల స్వామివారి ఆర్జిత సేవా టికెట్ల విడుదలకు సంబంధించి జూలై నెలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈనెల 18న టికెట్లను విడుదల చేసిన టీటీడీ, తాజాగా ఈ నెల 19న ఉదయం 10 గంటలకు టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21న ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ టికెట్లను పొందినవారు డబ్బు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ టికెట్లను ఏప్రిల్ 22న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్‌లకు సంబంధించిన టికెట్లను 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. అంగ ప్రదక్షిణం టికెట్ల కోటాను 23వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. ప్రత్యేక దర్శనం టికెట్లను 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అద్దె గదుల బుకింగ్ కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. అదే విధంగా వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ప్రత్యేక దర్శనం కోసం టోకెన్లను 23న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు.






