- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆలయ పరిశుభ్రత మొదలు అన్న ప్రసాదం వరకు ఎక్కడా పొరపాట్లు జరగకుండా పాలనా వ్యవస్థలో టీటీడీ (TTD) మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే శ్రీవాణి దర్శన టికెట్ల (Srivari Darshan Tickets)పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఏ రోజుకు ఆరోజే శ్రీవారి దర్శన టికెట్లను ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆ టికెట్ దర్శనానికి మూడు రోజుల టైమ్ పడుతుంది. ఆగస్టు 1 నుంచి 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఇక నుంచి ఉదయం శ్రీవాణి టికెట్ తీసుకుంటే అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 వద్ద రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 1 నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది.
శ్రీవాణి టికెట్ల కోటా పెంపు..
భక్తుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు శ్రీవాణి టికెట్ల కోటాను 1,500 నుంచి 2 వేలకు పెంచాలని టీటీడీ నిర్ణయించింది. ఇక నుంచి ప్రతిరోజూ కరెంట్ బుకింగ్ కోటా కింద తిరుమలలో 2 వేల టిక్కెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్టు (Renigunta Airport)లో 400 టిక్కెట్లు జారీ చేయనున్నారు.






