Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. తెలంగాణ వ్యక్తులకు తీవ్ర గాయాలు

by Ramesh Goud |

తిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డు(First Ghat Road)లో ప్రమాదం(Accident) జరిగింది.

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. తెలంగాణ వ్యక్తులకు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డు(First Ghat Road)లో ప్రమాదం(Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులకు తీవ్ర గాయాలు(Injured) అయ్యాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ఓ కారు మొదటి ఘాట్ రోడ్డులోని 19వ మలుపు వద్ద ప్రమాదానికి గురైంది. శనివారం తెల్లవారుజామున స్కార్పియో వాహనం డివైడర్ ఢీ కొట్టి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తెలంగాణ(Telangana)కు చెందిన ఇద్దరు వ్యక్తులు గాయాల పాలయ్యారు. కారులో ఉన్న మరి కొందరు క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిద్రమత్తు అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story